Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీజే అవ‌తార‌మెత్తిన భార‌త జట్టు కోచ్ ర‌విశాస్త్రి

  • ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ర‌విశాస్త్రి
  • న్యూఇయ‌ర్ విషెస్ తెలుపుతూ ట్వీట్‌
  • ఆక‌ట్టుకుంటున్న కామెంట్లు
భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ర‌విశాస్త్రి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. కేప్‌టౌన్‌లోని ఓ ప‌బ్‌లో డీజే క‌న్సోల్ ముందు వాటిని ఆప‌రేట్ చేస్తున్న‌ట్లుగా ఆయ‌న పోజు పెట్టారు. అభిమానుల‌కు కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆయ‌న ట్వీటారు. డీజే అవ‌తారంలో ఆయ‌న‌ను చూసిన వారంతా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

న్యూ ఇయ‌ర్ రావ‌డానికి కొన్ని గంట‌ల ముందే ఆయ‌న ట్వీట్ చేసి నిజంగానే కోచ్ అనిపించుకున్నాడ‌ని అభిమానులు కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుతో క‌లిసి ఆయ‌న కూడా ద‌క్షిణాఫ్రికా పర్య‌ట‌న‌లో ఉన్నారు. భార‌త జ‌ట్టు త‌మ త‌మ కుటుంబాల‌తో క‌లిసి అక్క‌డే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్నారు. జ‌న‌వ‌రి 5 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. మొత్తంగా 3 టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నారు.
dj
ravi shashtri
coach
tweet

More Telugu News